ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత్.. కోహ్లీ మిస్

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు సన్నద్ధత మొదలుపెట్టారు.

Update: 2024-11-12 13:13 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు సన్నద్ధత మొదలుపెట్టారు. ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా తొలి మ్యాచ్‌కు దాదాపు 10 రోజుల ముందే అక్కడికి వెళ్లింది. మంగళవారం పెర్త్‌లోని వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు.

రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్‌ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో‌ను ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పలువురు ప్లేయర్లు కూడా సాధన చేశారు. భారత జట్టు కంటే ముందే ఆస్ట్రేలియాకు చేరుకున్న విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌‌కు దూరంగా ఉన్నాడు. మరోవైపు, ఆసిస్‌ పర్యటనలోనే ఉన్న భారత్ ‘ఏ’ జట్టుతో మొదట సీనియర్ల జట్టు వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. వార్మప్ మ్యాచ్ కంటే ప్రాక్టీస్ చేయడం ద్వారానే ఎక్కువ ఉపయోగం ఉంటుందని హెడ్ కోచ్ గంభీర్, అతని బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News