బ్రేకింగ్: శతకంతో రెచ్చిపోయిన గైక్వాడ్.. ఆసీస్‌పై టీమిండియా భారీ స్కోర్
వన్డే వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా యంగ్ బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. 5 మ్యాచుల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించిన
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా యంగ్ బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. 5 మ్యాచుల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇవాళ గువాహటిలో జరుగుతోన్న మూడవ టీ20లోనూ భారీ స్కో్ర్ చేసింది. భారత యంగ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కాగా, మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. రెండవ టీ20లో పరుగుల వరద పారించిన యంగ్ ఓపెనర్ జైశ్వాల్ ఈ మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గైక్వాడ్.. కేవలం 57 బంతుల్లోనే 123 పరుగులు చేసి.. టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 39, యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ 31 పరుగులు చేయడంతో భారత్ 222 భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో మాక్స్ వెల్, రిచర్డ్‌సన్, బెహ్రాన్‌డార్ఫ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 223 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగింది.