ICC Champions Trophy : పాకిస్తాన్ ట్రావెలింగ్‌కు బీసీసీఐ ‘నో’
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు గానూ పాకిస్తాన్‌కు భారత జట్టు రావడం లేదని బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమాచారం అందించింది.
దిశ, స్పోర్ట్స్ : ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకుగానూ పాకిస్తాన్‌కు భారత జట్టు రావడం లేదని బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమాచారం అందించింది. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌లో పర్యటించొద్దని చెప్పినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. ఎనిమిది టీమ్‌లు ఈ టోర్నీలో ఆడనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. తాజా పరిమాణాలతో ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇండియా మ్యాచ్‌ల నిర్వహణ వేదికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పీసీబీ చైర్మన్ మొసిన్ నఖ్వీ శుక్రవారం ఇదే అంశంపై స్పందిస్తూ.. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌ల నిర్వహణను తోసి పుచ్చారు. అయితే గతంలోనే హైబ్రిడ్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ప్రణాళికలు రూపొందించారు.
షెడ్యూల్ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్..!
పాకిస్తాన్‌కు దగ్గరగా ఉన్నందున భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్ పరిశీలనలో ఉంది. దీంతో పాటు శ్రీలంక కూడా షార్ట్ లిస్ట్ అయింది. తాజా పరిణామాలతో వచ్చే వారం విడుదల కావాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త రాజకీయాల కారణంగా 2008లో ఆసియా కప్ ఆడినప్పటి నుంచి పాకిస్తాన్‌లో భారత్ పర్యటించలేదు. చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్తాన్ 2012-13లో చివరి సారిగా దైపాక్షిక సిరీస్‌ను భారత్‌లో ఆడారు. ప్రస్తుతం ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.