T-20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇండియా.. మొదటి బౌలింగ్ చేయనున్న పాక్

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ 20 వరల్డ్ కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. టీ 20 వరల్డ్ కప్‌లో

Update: 2024-06-09 14:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ 20 వరల్డ్ కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. టీ 20 వరల్డ్ కప్‌లో దాయాదులు పాకిస్థాన్, టీమిండియా జట్లు మరికాసేపట్లో తలపడబోతున్నాయి. అమెరికా న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, ఈ మ్యాచ్ జరిగే నసావు క్రికెట్ స్టేడియం పరిసరాల్లో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు అవ్వా్ల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. ఇక, ఈ టోర్నీలో ఐర్లాండ్‌పై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. పసికూన అమెరికా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలై దాయాది పాకిస్థాన్ ఒత్తిడిలో ఉంది. 

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్


Similar News