టీమ్ ఇండియా స్టార్ ఆటగాడిపై లైంగిక ఆరోపణలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు

భారత హాకీ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌ లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్నాడు.

Update: 2024-02-06 18:16 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత హాకీ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌ లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. 22 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వరుణ్ తనను లోబర్చుకున్నాడని సదరు యువతి ఆరోపించింది. 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతనితో పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలో తన వయసు 17 ఏళ్లు అని ఫిర్యాదులో పేర్కొంది. గత ఐదేళ్లలో వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వరుణ్ పంజాబ్‌లోని జలంధర్‌లో నివస్తున్నాడు. ప్రస్తుతం అతను భువనేశ్వర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ కోసం భువనేశ్వర్‌లో భారత జట్టు సన్నద్ధమవుతున్నది. అయితే, కేసు నమోదైన తర్వాత వరుణ్ పరారీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వరుణ్ పరారీలో లేడని, భువనేశ్వర్‌లో జట్టుతోనే ఉన్నాడని హాకీ ఇండియా వర్గాలు మీడియాకు తెలిపాయి. కాగా, 2017 నుంచి వరుణ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత జట్టులోనూ, గతేడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోనూ అతను సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరపున 142 మ్యాచ్‌లు ఆడిన అతను 40 గోల్స్ చేశాడు. 

Tags:    

Similar News