'లక్కీగా వరల్డ్ కప్ గెలిచారు'.. 1983 భారత జట్టుపై విండీస్ లెజెండ్ సంచలన కామెంట్స్

1983 వన్డే వరల్డ్ కప్‌లో వరల్డ్ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ని ఫైనల్‌లో చిత్తుగా ఓడించి, మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సాధించింది టీమిండియా.

Update: 2023-07-06 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: 1983 వన్డే వరల్డ్ కప్‌లో వరల్డ్ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ని ఫైనల్‌లో చిత్తుగా ఓడించి, మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సాధించింది టీమిండియా. అయితే ఈ విజయం లక్కీగా వచ్చిందంటూ వెస్టిండీస్ లెంజెండ్ ఆండీ రాబర్ట్స్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘అవును, మేం ఇండియా చేతుల్లో ఓడిపోయాం. విండీస్ టీమ్ పతనానికి కారణమైన ఓటముల్లో ఇది కూడా ఒకటి. క్రికెట్‌లో కొన్ని సార్లు విజయాలు వస్తాయి, మరికొన్ని సార్లు పరాజయాలు. మేం ఎప్పుడూ ఓటమిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవాళ్లం. ఎలాగైనా గెలవాలనే మ్యాచ్ ఆడతాం. కానీ, మా కంటే తోపు టీమ్‌ని ఇప్పటిదాకా చూడలేదు.. క్రికెట్‌ మ్యాచ్ సాగే ఆ ఒక్క రోజు ఎవరి టైం బాగుంటే వాళ్లు గెలుస్తారు. ఫైనల్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేశాం. 1983 వరకూ మేం ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

1983లో రెండు సార్లు ఇండయా చేతుల్లో ఓడిపోయాం. 1975 నుంచి 1983 వరకూ మాకు వచ్చిన రెండు పరాజయాలు అవే. ఆ రెండు మ్యాచుల్లోనూ మేం బాగా ఆడలేకపోయాం. ఇండియాకి అదృష్టం బాగా కలిసి వచ్చింది.. మా టీమ్‌లో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నారు. ఇండియాలో తోపు ప్లేయర్లు ఎవ్వరూ లేరు. భారత బ్యాటింగ్‌లో ఎవ్వరి బ్యాటింగ్‌ నాకు పెద్దగా నచ్చలేదు. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. బౌలింగ్‌లోనూ ఒక్కరు కూడా 4 వికెట్లు కానీ, 5 వికెట్లు కానీ తీయలేదు. టాప్ క్వాలిటీ ఇన్నింగ్స్‌లు లేవు. ఏదో లక్‌ కలిసి వస్తే మా బ్యాడ్ లక్‌తో వాళ్లు గెలిచారంతే..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆండీ రాబర్ట్స్.

Tags:    

Similar News