టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌కు చేరుకున్న టీమిండియా..

ఐసీసీ విడుదల చేసిన వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.

Update: 2023-05-02 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ విడుదల చేసిన వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. రెండో ప్లేస్‌లో ఉండిన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చింది. 15 నెలలుగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌‌ను టీమిండియా దెబ్బకు రెండో ప్లేస్‌లోకి వచ్చింది. 20-22 మధ్యలో ఆసీస్‌ గెలిచిన సిరీస్‌లకు తక్కువ వెయిటేజ్‌ ఉండటంతో ఆసీస్‌ 5 పాయింట్లు కోల్పోయి (121 నుంచి 116 పాయింట్ల) ఒకటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.

ఫలితంగా టీమిండియాకు ర్యాంకింగ్స్‌లో అ‍గ్రస్థానం లభించింది. వచ్చే నెలలో జూన్‌ 7 జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు భారత్‌కు టాప్‌ ర్యాంక్‌ మంచి బూస్టప్‌ ఇవ్వనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య టైటిల్‌ కోసం పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌ (121), ఆస్ట్రేలియా (116) తర్వాత ఇంగ్లండ్‌ (114), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్‌ (100), పాకిస్థాన్‌ (86), శ్రీలంక (84), వెస్టిండీస్‌ (76), బంగ్లాదేశ్‌ (45), జింబాబ్వే (32) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News