Rinku Singh: సిక్సర్ల సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!

వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Update: 2023-07-06 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఐపీఎల్‌లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అతనికి బదులు తిలక్ వర్మకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సూపర్ ఫినిషర్ అయిన రింకూ సింగ్‌ను తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు రింకూ సింగ్‌కు పక్కనపెట్టడానికి గల కారణం ఏంటో తెలియజేయాలని నిలదీస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన రింకూ సింగ్.. 14 మ్యాచుల్లో 59.25 సగటుతో 149.53 స్ట్రైయిక్ రేటుతో 474 పరుగులు చేసాడు. ఈ సీజన్‌లో 4 హాఫ్ సెంచరీలు చేసిన రింకూ సింగ్, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 9లో నిలిచాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది సంచలన విజయాన్నందించాడు. టీమిండియాలో ఫినిషర్ పాత్రకు రింకూ సింగ్ సరిగ్గా సరిపోతాడని, అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం అన్యాయమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సిక్సర్ల సింగ్‌కు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జట్టులో తన పేరు లేకపోవడంపై రింకూ సింగ్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలెక్షన్‌ను ఉద్దేశించి ఇన్‌స్టా స్టోరీలో ఓ కొటేషన్ షేర్ చేశాడు. 'కొందరికీ సోఫా కేవలం ఓ ఫర్నీచర్ మాత్రమే. మరికొందరికి అది సెలక్షన్‌కు తలుపు'అంటూ విలియం షేక్స్‌స్పియర్ కొటేషన్‌ను పంచుకున్నాడు.

Tags:    

Similar News