IND vs SL: మూడో వన్డేలోను టాస్ ఓడిన భారత్.. జట్టులోకి రిషబ్ పంత్, రియాన్ పరాగ్
భారత క్రికెట్ శ్రీలంక టూర్‌లో భాగంగా ఆ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో నేడు మూడో వన్డే మ్యాచ్ కొలంబో వేదికగా జరుగుతుండగా.. ఇందులో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ శ్రీలంక టూర్‌లో భాగంగా ఆ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో నేడు మూడో వన్డే మ్యాచ్ కొలంబో వేదికగా జరుగుతుండగా.. ఇందులో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ వన్డే సిరీస్ లో మొదట మ్యాచ్ టై అయింది. అలాగే రెండో మ్యాచులో విజయం సాధించిన శ్రీలంక జట్టు 0-1 తేడాతో సీరిస్ లో లీడ్ లో కొనసాగుతుంది. ఈ మ్యాచులో గెలిస్తే భారత జట్టుపై లంక సిరీస్ గెలుస్తుంది. అయితే ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని రోహిత్ సేనా భావిస్తుంది. ఇందుకోసం జట్టులో స్వల్ప మార్పులు చేసిన రోహిత్.. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ను, ఆర్షదీప్ స్థానంలో రియాన్ పరాగ్ ను జట్టులోకి తీసుకున్నారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(సి), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో