IND vs SL: శ్రీలంకకు బిగ్ షాక్..! రెండో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం
నేడు కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య మధ్యాహ్నం 2:30 గంటలకు రెండో వన్డే జరగబోతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : నేడు కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య మధ్యాహ్నం 2:30 గంటలకు రెండో వన్డే జరగబోతుంది. అయితే ఈ వన్డేకు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది.స్టార్ లెగ్ స్పిన్నర్, వానిందు హసరంగా మిగిలిన రెండు వన్డేలకు గాయంతో దూరం అయ్యారని జట్టు మ్యానేజ్మెంట్ సృష్టం చేసింది. మొదటి వన్డే మ్యాచులో హసరంగా తన చివరి ఓవర్ వేస్తున్న సమయంలో మోకాలుకు గాయం అయ్యింది. MRI స్కానింగ్ లో గాయం తీవ్రమైనదిగా తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు . దీంతో అతన్ని జట్టు నుండి రిలీజ్ చేసారు.
కాగా... హసరంగా మొదటి ODIలో ముఖ్యమైన పాత్ర పోషించాడు, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కు వచ్చి 35 బంతుల్లో 24 పరుగులు చెయ్యడమే కాకుండా ,బౌలింగ్ లో మూడు వికెట్లు తీసాడు.దీంతో హసరంగా దూరం అవ్వడం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పాలి. హసరంగా స్థానంలో 34 ఏళ్ల జెఫ్రీ వాండర్సేను జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే ఆ జట్టు స్టార్ బౌలర్లు పతిరనా,మధుశంక దూరమైన విషయం తెలిసిందే.