Asia Cup 2023: సచిన్‌ సరసన చేరిన రోహిత్‌ శర్మ..

ఆసియా కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

Update: 2023-09-10 16:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సచిన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఆసియా ‍కప్‌ వన్డే ఫార్మాట్‌లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక హాఫ్‌ సెంచరీల రికార్డును (భారత్‌ తరఫున) సమం చేశాడు. సచిన్‌ ఆసియా కప్‌ కెరీర్‌లో (వన్డేలు) మొత్తం 9 హాఫ్‌ సెంచరీలు చేయగా.. తాజాగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టడంతో హిట్‌మ్యాన్‌ (9) సచిన్‌ సరసన చేరాడు.

భారత్‌-పాక్‌ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు రేపు (సెప్టెంబర్‌ 11) రిజర్వ్‌ డేగా ఉండటంతో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది. అయితే వరుణుడు రేపు కూడా ఆటకు ఆటంకం కలిగించవచ్చని కొలొంబో వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కారణంగా ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 24.1 ఓవర్లలో 147/2గా ఉంది. రోహిత్‌ (56), గిల్‌ (58) ఔట్‌ కాగా.. కోహ్లి (8), రాహుల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు.


Similar News