Asia Cup 2023 Ind vs Pak Clash: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్‌ vs పాకిస్తాన్ మ్యాచ్‌ కష్టమే! కారణం ఇదే

ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.

Update: 2023-08-31 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఇక భారత్‌, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్‌ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది. కాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఇక హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి కూడా. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన ఫ్యాన్స్‌లో నెలకొంది. కాగా గురువారం కాండే వేదికగా జరగనున్న బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌కు కూడా వరుణడు అటంకం​ కలిగించే ఛాన్స్‌ ఉంది. అంతే కాకుండా సెప్టెంబర్ 4న భారత్-నేపాల్ మధ్య మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్‌లకి వర్షం ముప్పు ఉందట. ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌కి 86 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌కి వర్షం ముప్పు 76 శాతం ఉందని తెలుస్తోంది. వర్షం కారణంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసియా కప్ 2023లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఆసియా కప్‌ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆల్‌రౌండర్‌లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేసర్ మహ్మద్‌ షమీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా జట్టంతా ప్రత్యేక బస్సులో విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకుంది.

ఆసియా కప్‌కు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, రవీంద్ర జడేజా, ఇషాన్‌ కిషన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

రిజర్వు ప్లేయర్‌: సంజూ శాంసన్‌


Similar News