IND vs NZ 1st Test: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి

భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగ్గా.. ఇందులో భారత్ చివరి రోజు ఓడిపోయింది.

Update: 2024-10-20 07:11 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగ్గా.. ఇందులో భారత్ చివరి రోజు ఓడిపోయింది. ఈ మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం న్యూజిలాండ్ జట్టును 402 పరుగులకు ఆలౌట్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు మంచి ఫామ్ కొనసాగించారు. ఇందులో జైస్వాల్ 35, రోహిత్ 52, కోహ్లీ 70, సర్ఫరాజ్ ఖాన్ 150, పంత్ 99 పరుగులు చేశారు. వీరు అవుట్ కావడంతో అనంతరం వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే అవుట్ అయ్యారు. దీంతో భారత్ నాలుగో రోజు చివరి సెషన్‌లో 99.3 ఓవర్లకు 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 106 పరుగుల లీడ్ భారత్ దక్కించుకోగా.. 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్.. చివరి రోజు మొదటి సెషన్ లోనే లక్ష్యాన్ని చేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లు కాన్వే 17 అవుట్ కాగా.. విల్ యంగ్ 48, రచిన్ రవీంద్ర 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారు. మొదటి టెస్ట్ అనంతరం మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో 0-1 తేడాతో న్యూజిలాండ్ లీడ్ లో కొనసాగుతుంది.

Tags:    

Similar News