నేటి నుంచి హైదరాబాద్‌లో టీమ్ ఇండియా ట్రైనింగ్ క్యాంప్
సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌పై టీమ్ ఇండియా ఫోకస్ పెట్టింది.
దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌పై టీమ్ ఇండియా ఫోకస్ పెట్టింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో కీలకమైన ఈ సిరీస్‌లో సత్తాచాటాలని రోహిత్ సేన భావిస్తున్నది. సన్నద్ధతలో భాగంగా ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొననున్నది. నేటి నుంచి హైదరాబాద్‌లో ట్రైనింగ్ క్యాంప్ మొదలుకానుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొన్న వారికి రెండు రోజులపాటు విశ్రాంతినివ్వనున్నారు. విరాట్ కోహ్లీ ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడానికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో టీమ్ ఇండియా 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక్క ఓటమి, ఒక్క డ్రాతో 54.16 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సత్తాచాటడం ద్వారా తిరిగి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.