IND Vs AUS: రెచ్చిపోయిన భారత పేసర్లు.. ఆస్ట్రేలియా టాపార్డర్ విలవిల
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో పెర్త్ (Perth) వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత (Team India) పేసర్లు రెచ్చిపోయారు.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో పెర్త్ (Perth) వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత (Team India) పేసర్లు రెచ్చిపోయారు. ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) (26), రిషభ్ పంత్ (Rishabha Panth) (37), హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy) (41) మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswai Jaiswal), దేవదూత్ పడిక్కల్ (Devadut Padikkal) డకౌట్‌గా వెనుదిరిగారు. జట్టులో మొత్తం ఆరుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఈ సిరీస్‌లో కూడా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. అతడు కేవలం 5 పరుగులు చేసి హేజిల్‌వుడ్ (Hazlewood) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే, చివర్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy) ఆడేది మొదటి మ్యాచే అయినా ఎలాంటి బెరుకు లేకుండా ఆసిస్ బౌలర్లను సమర్ధవవంతంగా ఎదుర్కొన్నాడు. మొత్తం 59 బంతుల్లో 41 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 150 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) షాకిచ్చాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) (8), నాథన్ మెక్‌స్వీ (Nathan McSweeney) (10)లను చక్కటి బంతులతో బోల్తా కొట్టించాడు. అనంతరం మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) (2) మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అదేవిధంగా ఆసిస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steven Smith), బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ట్రావీస్ హెడ్ (Travis Head) (11), మిచెల్ మార్ష్ (Mitchell Marsh) (6)లు ఎక్కువ సేపు క్రీజ్ నిలవలేకపోయారు. ట్రావీస్ హెడ్ (Travis Head), హర్షిత్ రాణా (Harshith Rana) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవ్వగా.. మిచెల్ మార్ష్ సిరాజ్ (Mitchell Marsh) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) (3), బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్ 7 వికెట్లు కోల్పోయి 67 పరుగు చేసింది. కీపర్ అలెక్స్ క్యారీ (Alex Carey) 28 బంతుల్లో 19, మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 14 బంతుల్లో 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.