ఓటమి.. మరోవైపు విమర్శలు.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌పై వేటు పడనుందా..?

టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా ఓడింది.

Update: 2023-02-12 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా ఓడింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలకు మంచి ఆరంభాలు లభించాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వీళ్లందరూ విఫలమయ్యారు. ఇక ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఆసీస్ జట్టు పై పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగ్‌పూర్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల ఓటమి తర్వాత ఆసీస్ మీడియా నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఢిల్లీ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు రానుంది. నాగ్‌పూర్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డేవిడ్ వార్నర్ ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్‌లో 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో వార్నర్‌ను కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ టెస్ట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. అతని స్థానంలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం ఉంది. దీంతోనే వార్నర్‌పై వేటు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News