వేలంలో... కోహ్లీ జెర్సీకి రూ.40 లక్షలు

నిరుపేద పిల్లల సహాయార్ధం నిర్వహించిన వేలంలో.. భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40 లక్షలు ధర పలికింది.

Update: 2024-08-24 08:00 GMT

దిశ, వెబ్ డెస్క్: నిరుపేద పిల్లల సహాయార్ధం నిర్వహించిన వేలంలో.. భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40 లక్షలు ధర పలికింది. దీంతో పాటు అదే వేలంలో కోహ్లీ గ్లోవ్స్ 28 లక్షలు పలికింది. అయితే ఈ వేలాన్ని నిర్వహించింది భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో, వెనుకబడిన పిలల్లకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ వేలాన్ని నిర్వహించినట్లు కేఎల్ రాహుల్, అతియా తెలిపారు. ఈ వేలంలో భారత క్రికెటర్ల బ్యాట్లు, గ్లోవ్స్, జెర్సీలు వేలం వేయగా రూ.193 కోట్ల నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ వేలంలో అత్యధికంగా కోహ్లీ ధరించిన జెర్సీ రూ. 40 లక్షలు పలకడం విశేషం.

అయితే.. కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ప్రారంభించిన ఈ ప్రచారంలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ లతో పాటు విదేశీ ఆటగాళ్లు నికోలస్ పూరన్, జాస్ బట్లర్, డికాక్ ఇంకా తదితరులు భాగస్వాములయ్యారు. కాగా నిరుపేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాహుల్ దంపతులపై నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. 


Similar News