పాక్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం

పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Update: 2024-12-13 12:58 GMT

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అతను వీడ్కోలు పలకడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో గుడ్ బై చెప్పాడు. కానీ, ఆ తర్వాత రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే, దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. 35 ఏళ్ల ఇమాద్ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారిగా పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, 55 వన్డేలు, 75 టీ20లు ఆడిన అతను 1,540 రన్స్, 117 వికెట్లు తీశాడు. 

Tags:    

Similar News