ICC World Cup 2023 : IND Vs AUS ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోడీ

ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఐసీసీ వరల్డ్ కప్ - 2023 చివరి ఘట్టానికి చేరుకుంది.

Update: 2023-11-17 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఐసీసీ వరల్డ్ కప్ - 2023 చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా.. సెకండ్ సెమీ ఫైనల్‌లో గురువారం సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచింది. వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనుష్క శర్మ, షాహీద్ కపూర్ వంటి బాలీవుడ్ సెటబ్రిటీలు హాజరైన విషయం తెలిసిందే. కాగా, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టైటిల్ పోరు ఈ నెల 19న (ఆదివారం) అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. 1లక్షా 32 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు తెలిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం కోహ్లి, షమీలను మోడీ అభినందించారు. అయితే సాధారణంగానే క్రికెట్ లవర్ అయిన మోడీ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఇదే స్టేడియంలో గతంలో బోర్డర్ - గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు మోడీ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు.

Tags:    

Similar News