ICC Women’s ODI rankings : స్మృతి, హర్మన్‌ప్రీత్ ర్యాంక్‌లు డౌన్.. 5వ ర్యాంక్‌కు ఎగబాకిన దీప్తి
టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వన్డేల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది.
దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన భారత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వన్డేల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను మంగళవారం రిలీజ్ చేసింది. ఇటీవల విండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆఖరి వన్డేలో దీప్తి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. 6 వికెట్లు పడగొట్టడంతో 39 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 5వ ర్యాంక్‌కు చేరుకుంది. దీంతో తిరిగి టాప్-5లో నిలిచింది. అలాగే, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 30వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆల్‌రౌండర్ విభాగంలో 3వ స్థానాన్ని కాపాడుకుంది.
ఇతర భారత బ్యాటర్లు కూడ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. రోడ్రిగ్స్ 4 స్థానాలు అధిగమించి 22వ ర్యాంక్‌లో నిలువగా.. రిచా ఘోష్ 7 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కు, హర్లీన్ డియోల్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 54వ ర్యాంక్‌కు చేరుకున్నారు. మరోవైపు, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక్క స్థానం కోల్పోయి 3వ ర్యాంక్‌కు.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయారు. విండీస్‌తో సిరీస్‌లో 10 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన బౌలర్ రేణుక సింగ్ మూడు స్థానాలు వెనక్కినెట్టి 17వ ర్యాంక్‌కు చేరుకుంది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది. ఆరు స్థానాలు ఎగబాకిన ఆమె తిరిగి టాప్-10లో చోటు దక్కించుకోవడంతోపాటు 7వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలింగ్ విభాగంలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 7వ స్థానంలోనే నిలిచింది.