ICC Trophy Tour : ‘ట్రోఫీ టూర్’ వేదికలు మార్పు.. రివైజ్డ్ షెడ్యూల్ అనౌన్స్
పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో చాంపియన్స్ ‘ట్రోఫీ టూర్’ చేయడాన్ని బీసీసీఐ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో చాంపియన్స్ ‘ట్రోఫీ టూర్’ చేయడాన్ని బీసీసీఐ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ముజఫరాబాద్, స్కర్దు, హుంజా క్యాలీలో ట్రోఫీ టూర్ చేయనునున్నట్లు పీసీబీ ప్రకటించడంతో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బీసీసీఐ తన అభ్యంతరాన్ని ఐసీసీకి స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం ట్రోఫీ టూర్ షెడ్యూలును ఐసీసీ మార్చింది. పీవోకేలో ట్రోఫీ టూర్‌ను ఐసీసీ కొత్త చీఫ్ జై షా సైతం ఖండించిన నేపథ్యంలో తాజాగా ఐసీసీ ‘గ్లోబర్ ట్రోఫీ టూర్’ను ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో టూర్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లు పాకిస్తాన్‌లో పర్యటించడం లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చిచెప్పింది. మరోవైపు పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్‌కు ససేమిరా అనడంతో ఈ ట్రోఫీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
ట్రోఫీ టూర్ షెడ్యూలు ఇలా..
16 నవంబర్ - ఇస్లామాబాద్, పాకిస్తాన్
17 నవంబర్ - టక్సిలా, మరియు కాన్పూర్, పాకిస్తాన్
18 నవంబర్ - అబోటాబాద్, పాకిస్తాన్
19 నవంబర్ - ముర్రే, పాకిస్తాన్
20 నవంబర్ - నతియా గలి, పాకిస్తాన్
22-25 నవంబర్ - కరాచీ, పాకిస్తాన్
26-28 నవంబర్ - అఫ్గానిస్తాన్
10-13 డిసెంబర్ - బంగ్లాదేశ్
15-22 డిసెంబర్ - సౌతాఫ్రికా
25 డిసెంబర్ - 5 జనవరి - ఆస్ట్రేలియా
6-11 జనవరి - న్యూజిలాండ్
12-14 జనవరి - ఇంగ్లాండ్
15-26 జనవరి - ఇండియా
27 జనవరి- పాకిస్తాన్‌లో ఈవెంట్ ప్రారంభం