ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్-2లో టీమిండియా
దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియా మంచి జోరుమీద ఉంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 120 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 2గా టీమిండియా, 124 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది. కాగా ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ జట్టు 105 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ టీ20 రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో టీమిండియా 74 పాయింట్లు, 68.52 శాతం విజయాలతో అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఆరింట్లో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. భారత జట్టు గత రెండు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది.