శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత
శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఎత్తివేసింది.
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఎత్తివేసింది. ఈ మేరకు ఐసీసీ ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘బ్యాన్ విధించినప్పటి నుంచి ఎస్‌ఎల్‌సీని ఐసీసీ పర్యవేక్షిస్తుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వ బాధ్యతలపై ఐసీసీ సంతృప్తి చెందింది. అందుకే, ఎస్‌ఎల్‌సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం.’ అని ఐసీసీ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా, ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతేడాది నవంబర్‌లో ఐసీసీ నిషేధం విధించింది. బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని సభ్యత్వ బాధ్యతల ఉల్లంఘనగా ఐసీసీ పరిగణించి బోర్డును బ్యాన్ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్, దైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంక జట్టుకు అనుమతినిచ్చింది. కానీ, శ్రీలంక వేదికగా జరగాల్సిన అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికాకు తరలించిన విషయం తెలిసిందే.