పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ICC సీరియస్..
పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం డేంజర్‌లో పడింది. పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌కు వేదికైన రావల్పిండి పిచ్‌పై ఐసీసీ సీరియస్ అయింది.
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం డేంజర్‌లో పడింది. పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌కు వేదికైన రావల్పిండి పిచ్‌పై ఐసీసీ సీరియస్ అయింది. ఈ స్టేడియం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించడం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. ఈ పిచ్‌కు వరుసగా రెండోసారి ఈ రేటింగ్ దక్కింది. ఇక్కడ మరో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించకుండా సస్పెండ్ చేసే ప్రమాదం కనిపిస్తోంది. పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరో రెండు డీమెరిట్ పాయింట్లు ఈ స్టేడియం ఖాతాలో చేరాయి. దీనికి మరొ సారి డీమెరిట్ పాయింట్స్ వస్తే చాలు.. 12 నెలల పాటు ఇక్కడ మరో మ్యాచ్ నిర్వహించకుండా సస్పెండ్ చేస్తారు. ఈ స్టేడియం మరోసారి డీమెరిట్ పాయింట్లు పొందితే అంత్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం కోల్పోతుందని అని ఐసీసీ తన ప్రకటనలో వెల్లడించింది.