డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. ఎంతంటే.?

డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

Update: 2023-05-26 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఛాంపియన్‌గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందించే నగదు బహుమతి వివరాలను వెల్లడించింది. ఛాంపియన్‌గా నిలిచిన 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ రూపంలో దక్కనున్నాయి. మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 350,000 డాలర్లు, ఐదో ప్లేస్‌లో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు, ఆ తర్వాత ఆరు, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచిన జట్లు న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ షేర్‌ చేయబడుతుంది.

జూన్ 7-11 మధ్య లండన్‌లో ఓవల్ మైదానం వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. లండన్ వెళ్లిన టీమిండియా ఫస్ట్ బ్యాచ్.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ ప్రారంభించింది. ఐపీఎల్ ఆడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. టోర్నీ ముగిసిన వెంటనే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నారు.

Tags:    

Similar News