T20 వరల్డ్ కప్‌లో అతడిని టాప్ స్కోరర్‌గా చూడాలనుకుంటున్నా.. పాంటింగ్
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో
దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మరోసారి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీని టాప్ స్కోరర్‌గా చూడాలనుకుంటున్నానని పాంటింగ్ తెలిపాడు. కానీ, ఆస్ట్రేలియా జట్టుపై మాత్రం అతడు పరుగులు చేయకుండా చూసుకోవాలని చమత్కరించాడు. గత కొంత కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతోన్న కోహ్లీ.. సుధీర్ఘ విశ్రాంతి అనంతరం రాణించే అవకాశం ఉందన్నాడు. నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్న కోహ్లీ మునుపటి ఫామ్‌లోకి రావాలని ఆశభావం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2022లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. అతడి బ్యాటింగ్‌లో మళ్లీ గతంలో ఉన్న కాన్ఫిడెంట్ కనిపిస్తుందని పేర్కొన్నాడు.
ఇక చాలా కాలంగా ఫామ్ లేమి సమస్యతో సతమతమవుతోన్న కోహ్లీ.. ఆసియా కప్ 2022లో మంచి టచ్‌లోకి వచ్చాడు. దాయాది పాక్‌పై అద్భుతంగా రాణించిన కోహ్లీ విలువైన 35 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ.. దాదాపు ఆరునెలల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానకి అవధుల్లేవు. విరాట్ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read : ఆ మాట అని ఉంటే సెహ్వాగ్ బతికే వాడు కాదు.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు