దిశ, వెబ్‌డెస్క్: తొలి టెస్ట్‌లో విఫలమైన కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్స్ విమర్శలు చేస్తున్నారు. అయితే రాహుల్‌కు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్‌ఖాన్ లాంటి ఎంతో మంది ప్రతిభావంతులు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. వారిని కాదని మేనేజ్‌మెంట్ రాహుల్‌కు పదే పదే అవకాశాలు ఇస్తోందంటూ వెంకటేష్ ప్రసాద్ కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఐపీఎల్ కాంట్రాక్టులు పోతాయనే భయంతోనే సెలెక్టర్లు రాహుల్ విఫలమవుతోన్న అతడిని జట్టులో కొనసాగిస్తున్నారంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. సెకండ్ టెస్ట్‌లో రాహుల్‌కు ఛాన్స్ ఇవ్వడమే మంచిదంటూ పేర్కొన్నాడు. గత రెండు, మూడేళ్లుగా అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని గవాస్కర్ పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో రాణించే సామర్థ్యం అతడికి ఉందని.. రెండు టెస్ట్‌లో మేనేజ్‌మెంట్ అతడికి మరో అవకాశం ఇస్తుందని తాను భావిస్తోన్నట్లు గవాస్కర్ తెలిపాడు. ఒకవేళ ఈ టెస్ట్‌లో విఫలమైతే అతడి ప్రత్యామ్నాయంగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు.. కాబట్టి టీమ్‌కు ఇబ్బంది ఉండదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.