HYD: ఐపీఎల్ అభిమానులకు TSRTC గుడ్‌న్యూస్
ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ మరోసారి శుభవార్త తెలిపింది. నేడు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ మరోసారి శుభవార్త తెలిపింది. నేడు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ వరకు 60 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. మెహదీపట్నం, హయత్‌నగర్, ఎన్‌జీవోస్ కాలనీ, కోఠి, అఫ్జల్‌గంజ్, లకిడీకాపూల్, జీడిమెట్ల, కొండాపూర్, బీహెచ్‌ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు బస్సులు నడుస్తాయన్నారు.
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడకుండా, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని క్రికెట్ అభిమానులకు సజ్జనర్ సూచించారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. దీంతో, ఎస్ఆర్‌హెచ్ అభిమానులు మ్యాచ్‌ను చూసేందుకు భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి.
క్రికెట్ అభిమానులారా!? #IPL మ్యాచ్ ని వీక్షించేందుకు ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి మీరు వెళ్తున్నారా!? మీ కోసమే #Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఇవాళ జరిగే #SunRisersHyderabad Vs #MumbaiIndians మ్యాచ్ కు ముందు, అనంతరం వాటిని… pic.twitter.com/NtQVejRHDo
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 18, 2023