BWF Ranking: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్న ప్రణయ్..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ అందుకున్నాడు.

Update: 2023-08-29 14:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ అందుకున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 6 ర్యాంక్‌కు చేరుకున్నాడు. మంగళవారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. తన కెరీర్‌లో అతడికిదే అత్యుత్తమ ర్యాంక్‌. గతంలో ఏడో ర్యాంక్‌లో నిలిచిన ప్రణయ్​ఇప్పుడు ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఇతర భారత షట్లర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. లక్ష్య సేన్.. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం నష్టపోయి 12వ స్థానంలో నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. 20వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఓ స్థానం ఎగబాకి 14వ ర్యాంక్‌లో నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ప్రపంచ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ రెండు స్థానాలు మెరుగై 17వ ర్యాంక్‌ దక్కించుకుంది.


Similar News