గుర్రపు స్వారీ, భరతనాట్యం నేర్చుకుంటా : మను బాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-08-16 19:03 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ కోసం కొంతకాలంగా షూటింగ్‌పైనే ఫోకస్ పెట్టిన ఆమె.. మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నది. ఈ సమయంలో తన వ్యక్తిగత అభిరుచులపై ఫోకస్ పెట్టనున్నట్టు మను బాకర్ తెలిపింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మను బాకర్ మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత అభిరుచులపై దృష్టి పెట్టడానికి ఇప్పుడు నాకు సమయం దొరికింది. మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ అంటే ఇష్టం. స్కేటింగ్‌ను ఎంజాయ్ చేస్తాను. భరతనాట్యం నేర్చుకుంటున్నాను. కానీ, ఫ్రాన్స్‌లో ట్రైనింగ్ కారణంగా నా క్లాస్‌లను మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్లీ దృష్టి పెడతా.’ అని తెలిపింది. ఆమెతో కలిసి ఇంటర్వ్యూకు హాజరైన కోచ్ రాణా.. ‘గుర్రపు స్వారీ, స్కేటింగ్ చాలా ప్రమాదకరమని, పడిపోతారని తెలిసి ఎవరైనా గుర్రపు స్వారీ చేస్తారా?’ అని నవ్వుతూ అన్నాడు. వెంటనే మను బదులిస్తూ.. తాను ఇప్పటికే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నానని, ఏదైనా ప్రమాదం జరిగితే తన బాధ్యతనేనని తెలిపింది. గుర్రపు స్వారీ, స్కైడైవింగ్, స్కూబా కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నానని చెప్పింది. 

Tags:    

Similar News