హాకీ5s వరల్డ్ కప్‌కు భారత జట్లు ఎంపిక

ఈ నెలలో ఒమన్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) పురుషుల, మహిళల హాకీ5s వరల్డ్ కప్ టోర్నమెంట్‌లకు హాకీ ఇండియా ఆదివారం భారత జట్లను ప్రకటించింది.

Update: 2023-12-31 17:07 GMT

న్యూఢిల్లీ : ఈ నెలలో ఒమన్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) పురుషుల, మహిళల హాకీ5s వరల్డ్ కప్ టోర్నమెంట్‌లకు హాకీ ఇండియా ఆదివారం భారత జట్లను ప్రకటించింది. సీనియర్ ఫార్వార్డ్ సిమ్రాన్‌జీత్ సింగ్ నాయకత్వంలో పురుషుల జట్టు టోర్నీలో అడుగుపెట్టనుంది. డిఫెండర్ మన్‌దీప్ మోర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సురాజ్, ప్రశాంత్ కుమార్ గోల్ కీపర్లుగా ఎంపికవ్వగా.. మన్‌జీత్, మహ్మద్ రహీల్, మనిందర్ సింగ్, పవన్, గుర్జోత్ సింగ్, ఉత్తమ్ సింగ్ సెలెక్ట్ అయ్యారు. ఇక, ఉమెన్స్ జట్టును గోల్ కీపర్ రజనీ ఎటిమార్పు నడిపించనుండగా.. మహిమ చౌదరి డిప్యూటీగా వ్యవహరించనుంది. బన్సారీ సోలంకి రెండో గోల్ కీపర్‌గా ఎంపికవ్వగా.. అక్షత, జ్యోతి ఛత్రి, మరియానా కుజుర్, ముంతాజ్ ఖాన్, అజ్మీనా కుజుర్, రుతుజ, దీపిక జట్టులో భాగమయ్యారు. కాగా, ఈ నెల 24 నుంచి 27 మధ్య మహిళల టోర్నీ జరగగా.. 28 నుంచి 31 మధ్య పురుషుల టోర్నీ జరగనుంది. ఈ నెల 24న జరిగే తొలి మ్యాచ్‌లో మహిళల జట్టు పొలాండ్‌తో తలపడనుండగా.. పురుషుల జట్టు ఈ నెల 28న స్విట్జర్లాండ్‌ను ఢీకొట్టడం ద్వారా టోర్నీని ఆరంభించనుంది. 

Tags:    

Similar News