టీమ్ మేట్‌తో ‘హీత్ స్ట్రీక్’.. డెత్ రూమర్స్ నేపథ్యంలో వైరల్‌

జింబాబ్వే మాజీ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఇటీవల న్యూస్ వెలువడటం క్రికెట్ ఫ్యాన్స్, సహచర ఆటగాళ్లను షాక్‌కు గురి చేసింది.

Update: 2023-08-26 17:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: జింబాబ్వే మాజీ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఇటీవల న్యూస్ వెలువడటం క్రికెట్ ఫ్యాన్స్, సహచర ఆటగాళ్లను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత నిజం కాదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే హీత్ స్ట్రీక్‌ను తన మాజీ టీమ్ మేట్ ‘రే ప్రైస్‌’ కలిసిన ఫొటో వైరల్‌గా మారింది. ఇందులో స్ట్రీక్ గుర్తుపట్టని విధంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా, నవ్వుతూ కనిపించాడు.

దీంతో ఆయన చనిపోయినట్లు జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక హీత్ స్ట్రీక్ మరణించినట్లు సోషల్ మీడియాలో మొదట పోస్ట్ చేసింది జింబాబ్వే మాజీ ఆటగాడు హెన్రీ ఒలంగా అని తెలిసిందే. కానీ బతికున్నట్లు తెలిసిన వెంటనే ఒలంగా తన పోస్ట్‌లు డిలీట్ చేసి క్షమాపణ కూడా చెప్పాడు. కాగా.. హీత్ స్ట్రీక్‌ 65 టెస్టులు, 189 వన్డేల్లో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించి 4933 పరుగులు చేయడంతో పాటు 455 వికెట్లు తీశాడు.


Similar News