వీడియో గేమ్‌‌లా బుమ్రా బౌలింగ్ : హర్షదీప్ సింగ్

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-8లో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-06-27 19:01 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-8లో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.దీనికి సంబంధించి బీసీసీఐ ఓ వీడియోను విడుదల చేయగా.. అందులో జస్ప్రిత్ బుమ్రాపై హర్షదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకోవడంపై హర్దదీప్ స్పందిస్తూ..‘బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టం అనిపించదు. అతడు వీడియో గేమ్ లా బౌలింగ్ చేస్తాడు. కేవలం రెండు, మూడు పరుగులే ఇస్తాడు. దీంతో బ్యాటర్లు ఒత్తిడికి లోనవుతారు. ఆ తర్వాత రిస్కీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అవుతారు. అలా నాకు చాలా వికెట్లు దక్కాయి. ఆ క్రెడిట్ అతడికే దక్కుతుంది’ అని చెప్పాడు. కాగా, ప్రస్తుత టోర్నీలో హర్షదీప్ ఇప్పటివరకు 15 వికెట్లు తీయగా..టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉండగా.. మరోవైపు బుమ్రా 11 వికెట్లు తీశాడు.

నాకంటే 1000 రేట్లు బుమ్రానే బెటర్ : కపిల్ దేవ్

బుమ్రా బౌలింగ్ తీరును టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మెచ్చుకున్నారు.‘బుమ్రా నాకంటే వెయ్యి రేట్లు అద్భుతమైన బౌలర్. ఇప్పుడున్న క్రికెటర్లలో చాలా మంది మంచి నైపుణ్యం కలిగిన వారే. ప్రస్తుత క్రికెట్‌లో చాలా మంది నాణ్యమైన క్రికెట్ ఆడటంతో పాటు ఫిట్‌నెస్ విషయంలో చాలా ముందున్నారు. తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాగే కొనసాగితే తప్పకుండా గొప్ప క్రికెటర్లు కావడం పెద్ద కష్టమేమీ కాదు’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.


Similar News