టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన భారత మహిళా సారథి..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు మూడో మ్యాచ్ ఆడింది.

Update: 2023-02-19 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు మూడో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌ ద్వారా భారత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కెరీర్‌లో 149వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా క్రికెట్ ప్రపంచంలో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచింది.

ఈ విషయంలో రోహిత్ శర్మను కూడా వెనక్కి నెట్టింది. భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ రికార్డును బీట్ చేసింది. హర్మన్‌ప్రీత్ తన కెరీర్‌లో మొత్తం 149 టీ20 మ్యాచ్‌లు ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ జూన్ 2009లో తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. రోహిత్ శర్మ సెప్టెంబర్ 2007లో తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.

హర్మన్‌ప్రీత్ కౌర్ - 149 టీ20 లో 134 ఇన్నింగ్స్‌లలో.. హర్మన్‌ప్రీత్ కౌర్ 28.19 సగటుతో 2,993 పరుగులు చేసింది. ఇందులో 1 సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్‌లో ఆమె అత్యధిక స్కోరు 103 పరుగులు. బౌలింగ్‌లో 32 వికెట్లు తీసింది. టీ20 ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News