ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-2 పొజిషన్‌‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్..

ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి చేరుకున్నాడు.

Update: 2023-02-08 16:21 GMT

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన పాండ్యా 4 వికెట్లు తీయడం తో పాటు 17 బంతుల్లో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో తాజా ర్యాంకింగ్స్‌లో 250 రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకున్న పాండ్యా ఒక్క స్థానం ఎగబాకి టాప్-2 పొజిషన్‌‌లో నిలిచాడు. అగ్రస్థానంలో 252 రేటింగ్ పాయింట్లతో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ ఉండగా.. పాండ్యా కేవలం 2 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.

ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 906 రేటింగ్ పాయింట్లతో సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తమ స్థానాలను కోల్పోయారు. కివీస్‌తో ఆఖరి టీ20లో 63 బంతుల్లో 126 పరుగులతో భారీ అజేయ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా 168 స్థానాలను ఎగబాకి 30వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 8 స్థానాలను వెనక్కినెట్టి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. టాప్-10 భారత బౌలర్లు లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News