Dhoni : 43 ఏళ్లలో ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నావు?.. ధోనీని అడిగిన హర్భజన్.. మాహీ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు.

Update: 2025-03-18 13:56 GMT
Dhoni : 43 ఏళ్లలో ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నావు?.. ధోనీని అడిగిన హర్భజన్.. మాహీ ఇచ్చిన సమాధానం ఏంటంటే?
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. 43 ఏళ్ల వయసులోనూ అతను ఫిట్‌నెస్ కాపాడుకోవడం చిన్న విషయం కాదు. ఇటీవల ఓ వివాహ వేడుకలో ధోనీ, హర్భజన్ సింగ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్.. ఈ వయసులో ఇంత ఫిట్‌‌గా ఎలా ఉన్నావు? అంటూ ధోనీని అడిగాడట. ధోనీతో జరిగిన ఆసక్తికర సంభాషణను హర్భజన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

‘ఇటీవల మా ఫ్రెండ్ కూతురి మ్యారేజ్‌లో ధోనీని కలిశా. అతను చాలా ఫిట్‌గా, సాలిడ్‌గా ఉన్నాడు. ఈ ఏజ్‌లో ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నావు?.. కష్టంగా లేదా? అని అడిగా. ‘ కష్టమే. కానీ, నేను ఫిట్‌గా ఉండి ఆడటాన్నే ఆస్వాదిస్తాను.’అని ధోనీ చెప్పాడు. ఆడాలనే తపన ఉంటేనే ఇది చేయగలం.ఏడాది పొడువునా క్రికెట్ ఆడకుండా ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలా కష్టం. కానీ, ఎలా సాధ్యమే ధోనీ చూపించాడు. ఇతరుల కంటే ఏదో మెరుగ్గా చేయాలని చూస్తున్నాడు. ఈ వయసులో అతను ఆడటమే కాదు..బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. 1-2 నెలలుగా ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎన్ని ఎక్కువ బంతులు వాడితే ఆ స్థాయిలో సిక్సర్లు వస్తాయి. చెన్నయ్‌లో ప్రతి రోజూ 2-3 గంటలు ప్రాక్టీస్ చేస్తాడు. ఈ వయసులో కూడా గ్రౌండ్‌కు ముందుగా వచ్చే వ్యక్తి.. చివరిగా వెళ్లే వ్యక్తి ధోనీనే. ఇతరులకు ధోనీకి అదే తేడా.’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News