హనుమ విహారి యూటర్న్.. ఆంధ్ర జట్టుకే ఆడతానని వెల్లడి

టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి యూటర్న్ తీసుకున్నాడు. దేశవాళీలో ఆంధ్ర జట్టుకే ఆడతానని వెల్లడించాడు.

Update: 2024-06-25 19:00 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి యూటర్న్ తీసుకున్నాడు. దేశవాళీలో ఆంధ్ర జట్టుకే ఆడతానని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌(ఏసీఏ)తో విభేదాల కారణంగా అతను ఆంధ్ర జట్టు నుంచి వైదొలిగాడు. ఇటీవల ఏసీఏ అతనికి నో అబెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దీంతో అతను మధ్యప్రదేశ్‌కు ఆడనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన నేపథ్యంలో విహారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను విహారి కలిశాడు. అనంతరం విహారి మాట్లాడుతూ.. ‘ఆంధ్ర క్రికెట్‌లో తిరిగి రావడం ఆనందంగా ఉంది. గత రెండేళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. అందుకే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను వదిలి వెళ్లే రాష్ట్రానికి ఆడాలనుకున్నా. కానీ, నాకు హామీ వచ్చింది. ఆంధ్ర జట్టులోకి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నా. దీర్ఘకాలంపాటు ఆంధ్ర జట్టుకు సేవలందిస్తా.’ అని తెలిపాడు. 


Similar News