హ్యాట్రిక్ కొట్టిన వెస్టిండీస్.. సూపర్ -8కు క్వాలిఫై

దిశ, స్పోర్ట్స్ బ్యూరో : టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బ్రియాన్ లారా స్టేడియం వేదికగా గురువారం వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్‌కు మధ్య మ్యాచ్ జరిగింది.

Update: 2024-06-13 18:23 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బ్రియాన్ లారా స్టేడియం వేదికగా గురువారం వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 149/9 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కేవలం 136/9 (20ఓవర్లలో)పరుగులు మాత్రమే సాధించి మరోమారు ఓటమిని మూటగట్టుకుంది.దీంతో కరేబియన్ జట్టు 13 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-సీ నుంచి నేరుగా సూపర్-8కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

2024 టీ20 ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న జట్లు పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఖచ్చితంగా సూపర్-8కు, సెమీస్‌కు చేరుతాయని భావించిన జట్లు ఇంటిముఖం పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అప్ఘనిస్తాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ జట్టు.. తాజాగా వెస్టిండీస్ చేతిలోనూ పరాజయం పాలైంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా న్యూజిలాండ్ ఛేదించలేకపోవడం క్రికెట్ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

రూథర్ ఫోర్డ్ ప్రభంజనం..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరేబియన్ జట్టులో టాపార్డర్ కుప్పకూలగా.. బ్రాండన్ కింగ్-9, చార్లెస్ 0, పూరన్ 17, చేజ్ 0, పొవెల్ 1.. ఆరో డౌన్‌లో బ్యాటింగ్ కు దిగిన రూథర్ ఫోర్డ్ తన బ్యాటింగ్‌తో ప్రభంజనం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో 68 పరుగులు(2 ఫోర్లు, 6 సిక్సులతో) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.అర్థసెంచరీ పూర్తిచేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ విన్నర్ జోసెఫ్..

కరేబియన్ జట్టులో అల్జారీ జోసెఫ్ తన బంతితో నిజంగా వండర్ క్రియేట్ చేశాడు. 4 ఓవర్లు వేసిన జోసెఫ్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఫిన్ అల్లెన్, గ్లెయిన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సౌతీ లాంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్ చేర్చడంలో జోసెఫ్ కీలక భూమిక పోషించి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడనడంలో అతిశయోక్తి లేదు.

గ్లెయిన్ ఫిలిప్స్ పోరాటం వృథా..

వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు చేతులెత్తేసింది. టాపార్డర్ కుప్పకూలగా.. ఆరోడౌన్‌లో బ్యాటింగ్ చేసిన గ్లెయిన్ ఫిలిప్స్ 40/33(3 ఫోర్లు, 2 సిక్సులతో) గౌరవప్రదమైన స్కోరును సాధించాడు. జట్టులోని మిగతా కీలక సభ్యులు చేతులెత్తేయడంతో నిర్ణీత ఓవర్లలో కివీస్ జట్టు కేవలం 139/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ జట్టుకు సూపర్-8 దారులు మూసుకుపోయినట్లే అని తెలుస్తోంది.

స్కోర్ బోర్డు :

వెస్టిండీస్ జట్టు : 149/9 (20ఓవర్లు)

బ్యాటింగ్ : బ్రాండన్ కింగ్ 9 (సి) కాన్వే (బి) నీషమ్, జాన్సన్ చార్లెస్ 0 (బి)బౌల్ట్, నికోలస్ పూరన్ 17 (సి)కాన్వే (బి) సౌతీ, పొవెల్ 1 (సి)కాన్వే (బి) సౌతీ, రోస్టన్ చేజ్ 0 (సి)రచిన్ రవీంద్ర (బి) ఫెర్గ్యూసన్, రూథర్ ఫోర్డ్ 68/39 (నాటౌట్), హోసెన్ 15 (బి)నీషమ్ (బి) మిచెల్ సంటనర్, ఆండ్రీ రస్సెల్ 14 (సి) ఫెర్గ్యూసన్ (బి)బౌల్ట్, షెఫర్డ్ 13 (ఎల్బీడబ్ల్యూ) (బి)ఫెర్గ్యూసన్, జోసెఫ్ 6 (బి) బౌల్ట్, గుడకేశ్ మోటీ 0 (నాటౌట్), ఎక్స్‌ట్రాలు-6

వికెట్ల పతనం : 1/1,20/2,21/3,22/4,30/5,58/6,76/7,103/8,112/9

బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ (4-1-16-3), టిమ్ సౌతీ (4-0-21-2), లోకీ ఫెర్గ్యూసన్ (4-0-27-2), జేమ్స్ నీషమ్ (4-0-27-1), ఫిలిప్స్ (1-0-9-0), మిచెల్ సంటనర్ (2-0-27-1), డారిల్ మిచెల్ (1-0-19-0)

న్యూజిలాండ్ జట్టు : 136/9 (20 ఓవర్లు)

బ్యాటింగ్ : డేవన్ కాన్వే 5 (సి) చేజ్ (బి) హోసెన్, ఫిన్ అల్లెన్ 26 (సి) రస్సెల్ (బి) జోసెఫ్, రచిన్ రవీంద్ర 10 (సి) రస్సెల్ (బి) మోటీ, కేన్ విలియమ్సన్ 1 (సి) నికోలస్ పూరన్ (బి) మోటీ, డారిల్ మిచెల్ 12(బి) మోటీ, గ్లెయిన్ ఫిలిప్స్ 40 (సి)పొవెల్ (బి) జోసెఫ్, జేమ్స నీషమ్ 10 (సి) బ్రాండన్ కింగ్ (బి) జోసెఫ్, మిచిల్ సంటనర్ 21 (నాటౌట్), టిమ్ సౌతీ 0 (సి అండ్ బి) జోసెఫ్, ట్రెంట్ బౌల్ట్ 7 (సి) చేజ్ (బి) రస్సెల్, లోకీ ఫెర్గ్యూసన్ 0 (నాటౌట్)

ఎక్స్‌ట్రాలు : 4

వికెట్ల పతనం : 20/1,34/2,39/3,54/4,63/5,85/6,108/7,108/8,117/9

బౌలింగ్ : హోసెన్ (4-0-21-1), షెఫర్డ్ (3-0-36-0), రస్సెల్ (4-0-30-1), జోసెఫ్ (4-0-19-4),గుడకేశ్ మోటీ (4-0-24-3), రోస్టన్ చేజ్ (1-0-4-0)


Similar News