యువరాజ్ సింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బయోపిక్‌పై T-సిరీస్ అధికారిక ప్రకటన

టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011లో భారత్ ప్రపంచ కప్ నెగ్గడంలో యూవీ కీలక పాత్ర పోషించారు.

Update: 2024-08-20 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011లో భారత్ ప్రపంచ కప్ నెగ్గడంలో యూవీ కీలక పాత్ర పోషించారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి అద్భుతంగా రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా.. యువరాజ్ సింగ్ ఫ్యాన్స్‌కు T-సిరీస్ శుభవార్త చెప్పింది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇందులో క్యాన్సర్‌తో పోరాడి నెగ్గి.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించిన తీరును అద్భుతంగా చూపించబోతున్నట్లు తెలిపారు. కాగా, 2000 సంవత్సరంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూవీ.. 2017 వరకు ఆడారు. 2003లో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను 2007 మరియు 2008 మధ్య భారత ODI జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2007 వరల్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఫీట్ ఇంతకుముందు ఏ క్రికెటర్ అందుకోలేదు. అదే మ్యాచ్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచురీ చేసి సత్తా చూపించాడు.


Tags:    

Similar News