దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు స్వర్ణం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో స్వర్ణం సాధించాడు.
దోహా : భారత స్టార్ జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో స్వర్ణం సాధించాడు. గతేడాది డైమండ్ లీగ్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన నీరజ్.. ఆ తర్వాత గాయం కారణంగా ఏ పోటీలోనూ పాల్గొనలేదు. ఈ ఏడాది అతను పాల్గొన్న తొలి టోర్నీ ఇదే. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నీరజ్.. అంచనాలను నిలుపుకుంటూ దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను దక్కించుకుని సీజన్‌కు ఘనంగా ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో 88.67 మీటర్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకున్నాడు.
నీరజ్ తొలి ప్రయత్నంలోని ప్రదర్శనను మిగతా అథ్లెట్లు అధిగమించలేక పోయారు. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకబ్ వాద్లిచ్(88.63 మీటర్లు) రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్(85.88 మీటర్లు), జర్మనీకి చెందిన జులియన్ వెబర్(82.62 మీటర్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అయితే, నీరజ్ స్వర్ణంతో మెరిసి నప్పటికీ 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. అలాగే, ఈ టోర్నీలో ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఎల్డోస్ పాల్(15.84 మీటర్లు) 10వ స్థానంతో సరిపెట్టాడు.