టర్కీ భూకంపం శిథిలాల కింద చిక్కుకున్న Ghana footballer Christian Atsu

టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే దాదాపు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు.

Update: 2023-02-07 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే దాదాపు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం వల్ల ఎంత మంది మరణించారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఘనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియన్ ప్రాణాలతో భయటపడ్డాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ అట్సు సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల క్రింద చిక్కుకున్నాడు. రెస్క్యూ టీమ్ గమనించి శిథిలాల నుంచి బయటకు తీసి.. ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు టర్కీస్ సూపర్ క్లబ్‌ హట్సే‌పోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

Tags:    

Similar News