యూరో కప్‌లో సంచలనం.. రొనాల్డో సేనను ఓడించిన పసికూన

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో చాంపియన్ షిప్‌లో పెను సంచలనం నమోదైంది.

Update: 2024-06-27 17:13 GMT

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో చాంపియన్ షిప్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా ఫుట్‌బాల్ టోర్నీలో పసికూన జట్టు అయిన జార్జియా చేతిలో పోర్చుగల్ దారుణంగా ఓటమి పాలైంది. గురువారం తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రూప్ దశ మ్యాచ్‌లో 74 ర్యాంకర్ అయిన జార్జియా క్రిస్టియానో రోనాల్డో సేనను 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. అయితే, వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచులో ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం గమనార్హం.

అయితే, మ్యాచ్ అనంతరం తమ జట్టు విజయానికి రొనాల్డో సలహానే కారణమని జార్జియా ఆటగాడు కివిచ క్వరత్సెలియ వెల్లడించారు.‘ మ్యాచ్ ఆరంభానికి ముందు మేము రొనాల్డోతో మాట్లాడాం. మేము విజయవంతంగా ఆడాలని ఆయన మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దాంతో మేము అద్భుతం చేయగలమని నమ్మాం’ అని కివిచ వెల్లడించారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే కివిచ గోల్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

క్వార్టర్స్‌లోకి అర్జెంటీనా..

కోపా అమెరికా ఫుట్‌బాల్ గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జంటీనా జట్టు క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గ్రూప్-ఏ మ్యాచులో ఆ జట్టు 1-0 గోల్ తేడాతో చిలీపై ఘన విజయం సాధించింది. 88వ నిమిషంలో మార్జినెజ్ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. మెస్సి కార్నర్ కిక్‌ను చిలీ గోల్ కీపర్ అడ్డుకోగా.. వెనక్కి వచ్చిన బంతిని మార్టినెజ్ గోల్ కోర్టులోకి పంపాడు. అంతకుముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన అర్జెంటీనా.. ఆరు పాయింట్లతో గ్రూపు స్టేజీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, గ్రూపు స్టేజీలో తన చివరి మ్యాచ్‌‌ను శనివారం పెరూతో ఆడనుంది.


Similar News