Gautam Gambhir: 'ఆ ఆలోచన పనికిమాలిన ఆలోచన'.. మాజీ హెడ్‌ కోచ్‌పై గంభీర్ ఫైర్

టీమిండియా వన్డే ప్రపంచకప్ కాంబినేషన్‌లో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండేలా చూసుకోవాలని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి చేసిన సూచనలపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు.

Update: 2023-08-22 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే ప్రపంచకప్ కాంబినేషన్‌లో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండేలా చూసుకోవాలని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి చేసిన సూచనలపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు. ఇది పనికిమాలిన ఆలోచనంటూ ఫైర్ అయ్యాడు. ఓ ఆటగాడి ఫామ్, ప్రభావాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని జట్టులోకి ఎంపిక చేయాలి కానీ లెఫ్టాండరా? రైట్ హ్యాండారా? అనేది చూడవద్దని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ముగ్గురు లెఫ్టాండర్స్ కంటే నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉండటం ముఖ్యమన్నారు. ఆసియాకప్ 2023 కోసం భారత జట్టును ప్రకటించకముందే.. టీమిండియా కాంబినేషన్‌పై చర్చించిన రవి శాస్త్రి.. టాప్-7 బ్యాటర్లలో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండాలని తెలిపాడు.

'ఓ ఆటగాడు లెఫ్టాండరా..? రైట్ హ్యాండరా..? అనేది అనవసరం. అసలు జట్టులో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండాలనే ఆలోచనే పనికిమాలినది. ఆటగాళ్ల క్వాలిటీ చూడలి తప్పా? లెఫ్టాండర్స్ ఎంతమంది ఉన్నారనేది అనవసం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే మంచి ప్లేయర్‌ ఉంటే చాలు' అంటూ రవి శాస్త్రిపై గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెరుగ్గా రాణిస్తే వారిని తీసుకోవాలి. ఫామ్‌లో లేకపోయినా లెఫ్టాండర్స్‌ను తీసుకోవడం సరికాదు. అసలు ఈ ఎడమ చేతివాటం ఆటగాళ్ల చర్చనే అనవసరం. లెఫ్టాండర్ కావాలంటే యశస్వీ జైస్వాల్ ఉన్నాడు. ఆటగాళ్ల క్వాలిటీ ముఖ్యం కానీ క్వాంటిటీ అవసరం లేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.


Similar News