సీనియర్ ఆటగాళ్లపై గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్
టీమిండియా సీనియర్ ప్లేయర్స్‌ను ఉద్దేశించి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సీనియర్ ప్లేయర్స్‌ను ఉద్దేశించి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు. గంభీర్ వ్యాఖ్యలపై సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది మండిపడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను మించి సెలెక్టర్లు ఇతరుల వైపు చూడాలని అనుకుంటే అలాగే చేయాలని, సీనియర్స్ అని వెనకడుగు వేయవద్దని గంభీర్ సూచించాడు. సెలెక్టర్లు వీళ్లను మించి ఇతరులను తీసుకోవాలని నిర్ణయించుకుంటే అలాగే చేయాలి. సీనియర్లను తొలగించినప్పుడు జరిగే రాద్దాంతం సర్వ సాధారణమే. ఆటలో వ్యక్తుల గురించి ఆలోచించకూడదు, జట్టు లక్ష్యాలే ప్రధానం.
వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్లి గెలవాలి. సూర్యకుమార్ లాంటి యువ ఆటగాళ్లు ఆ కల నెరవేర్చుతారేమో ఎవరికి తెలుసు.' అని గంభీర్ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీనియర్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఓ బీసీసీఐ అధికారి కూడా గంభీర్ తీరును తప్పుబట్టాడు. 'ప్రస్తుతం గంభీర్‌కు జట్టుతో సంబంధం లేదు. అతనో ఔట్‌సైడర్. జట్టు సెటప్‌లో ఏం జరుగుతోంది అతనికి తెలియదు. అతను అవగాహన లేని విషయాలపై మాట్లాడటం నిరాశపరిచింది. అతనో ఒర్రుబోతుగాడు అంతే.' అని సదరు అధికారి పేర్కొన్నాడు.