గ్యారీ కిర్‌స్టెన్.. ఒప్పందాన్ని ఉల్లంఘించాడు : పీసీబీ చైర్మన్ నఖ్వీ
పాకిస్థాన్ క్రికెట్ టీం పరిమిత ఓవర్ల కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten) రెండ్రోజుల కిందట రిజైన్ చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే పదవి నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
దిశ, స్పోర్ట్స్ : పాకిస్థాన్ క్రికెట్ టీం పరిమిత ఓవర్ల కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten) రెండ్రోజుల కిందట రిజైన్ చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే పదవి నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై పీసీబీ ఛైర్మన్ నఖ్వీ తాజాగా స్పందిస్తూ.. ‘కిర్‌స్టెన్ పీసీబీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. తను కొన్ని రూల్స్ బ్రేక్ చేసి మాతో ఒప్పందాన్ని ముగించాడు. ఈ నెలాఖరులోగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కొత్త హెడ్ కోచ్‌ను నియమిస్తాం. జేసన్ గిలెస్పీ (టెస్టు కోచ్) ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ కోసం మాత్రమే తాత్కాలిక కోచ్‌గా ఉండేందుకు అంగీకరించాడు. గిలెస్పీ కేవలం టెస్టు క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అందుకే జింబాబ్వే పర్యటనకు కొత్త కోచ్‌ని నియమిస్తాం’ అని నఖ్వీ తెలిపాడు.
కాగా, 2024 ఏప్రిల్ చివర్లో పాక్ వన్డే, టీ20 జట్లకు కిర్‌స్టెన్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల పాక్ జట్టు వరుసగా వైఫల్యం చెందటంతో జట్టు ఎంపికలో కోచ్ ప్రమేయాన్ని పీసీబీ తగ్గించింది. సెలక్షన్ కమిటీ మాత్రమే జట్టును ఇప్పుడు ఎంపిక చేస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా, జింబాబ్వేతో సిరీస్‌లకు స్వ్కాడ్ ఎంపిక, పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా రిజ్వాన్ నియామకంలోనూ కిర్‌స్టెన్‌ను భాగం చేయలేదు.అది నచ్చకే కోచ్ పదవికి కిర్‌స్టెన్ రిజైన్ చేశాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన కిర్‌స్టెన్ కోచ్‌గా భారత్‌కు 2011 వన్డే ప్రపంచకప్‌ను అందించాడు.