ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ పెంపు
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్-2023 ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది.
పారిస్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్-2023 ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. గతేడాది పోలిస్తే మొత్తం నగదు బహుమతిని 12.3 శాతం పెంచినట్టు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. 2022 ఎడిషన్‌లో మొత్తం ప్రైజ్‌మనీ 43.6 మిలియన్ యూరోస్‌గా ఉండగా.. తాజా నిర్ణయంతో ఆ మొత్తం 49.6 మిలియన్ యూరోస్‌కు పెరిగింది. దాంతో ఈ ఎడిషన్‌లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ విజేతలు 2.3 మిలియన్ యూరోస్ అందుకోనున్నారు. గతేడాది 2.2 మిలియన్ యూరోస్ నగదు బహుమతి పొందారు.
అలాగే, క్వాలిఫికేషన్ రౌండ్, మెయిన్ డ్రాలో మూడు రౌండ్లలో ఓడిపోయిన ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ కూడా పెరిగింది. పురుషుల, మహిళల డబుల్స్ ఈవెంట్స్ ప్రైజ్‌మనీ 4 శాతం పెరగగా.. వీల్ చైర్, క్వాడ్ ఈవెంట్ నగదు బహుమతి గతేడాది పోలిస్తే 40 శాతం పెరిగింది. కాగా, మే 28 నుంచి జూన్ 11 మధ్య ఫ్రెంచ్ ఓపెన్ జరగనుంది.