'అతడికి అద్భుతమైన అవకాశం'.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

ఆసియా కప్‌కు ఎంపికవడం ద్వారా తిలక్ వర్మకు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడేందుకు అద్భుతమైన అవకాశం దక్కిందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సబా కరీం తెలిపాడు.

Update: 2023-08-24 17:18 GMT

న్యూఢిల్లీ : ఆసియా కప్‌కు ఎంపికవడం ద్వారా తిలక్ వర్మకు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడేందుకు అద్భుతమైన అవకాశం దక్కిందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సబా కరీం తెలిపాడు. విండీస్‌పై టీ20 క్రికెట్‌లోకి అడుపెట్టిన తిలక్ వర్మ ఆ సిరీస్‌లో రాణించడంతో ఆసియా కప్ జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా సబా కరీం తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు. అతనికి అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా ఉందని చెప్పాడు. ‘కొన్ని సార్లు సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత మద్దతు ఇవ్వొచ్చు.

టీ20 ఫార్మాట్ నుంచి వన్డేలకు ఎంపిక చేస్తే నష్టం ఉండదు. తిలక్ వర్మ‌కు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉందన్న విషయం మర్చిపోకూడదు. 25 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో అతడి సగటు 50 కంటే ఎక్కువగా ఉంది. అంటే వన్డేల్లో ఎలా ఆడాలో అతనికి తెలుసు. కాబట్టి, టీ20 వాతావరణం నుంచి వన్డే క్రికెట్‌కు మారడానికి అతనికి ఎక్కువ సమయం పట్టదు. డ్రెస్సింగ్ రూం వాతావరణం అలవాటు పడటానికి, అంతర్జాతీయ క్రికెట్‌ను అర్థం చేసుకోవడానికి, విభిన్న పరిస్థితుల్లో ఎలా ఆడాలన్న విషయాలను తెలుసుకోవాడానికి తిలక్‌కు ఇది అద్భుతమైన అవకాశం.’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు.


Similar News