Sri Lanka: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్‌

Update: 2023-09-25 13:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన శ్రీలంక మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ సచిత్ర సేననాయకె కు బెయిల్ లభించింది. ఈ కేసులో అతడు సాక్ష్యాధారాలు ప్రభావితం చేయలేదని భావిస్తూ కొలంబో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. సేననాయకెపై 2020 శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఈ నెల 6న అరెస్టుకు ముందు లొంగిపోయిన సచిత్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 15 వరకు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడికి బెయిల్ లభించింది. సేననాయకె శ్రీలంక తరఫున ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్లో 78 వికెట్లు తీశాడు.


Similar News