అతను వరుసగా విఫలమవుతున్న ఎందుకు ఎంపిక చేస్తున్నారు.. వరుస ట్వీట్లతో ఫైరైనా టీమిండియా మాజీ పేసర్

Former Indian pacer Venkatesh Prasad criticizes KL Rahul's poor performance with a series of tweets.

Update: 2023-02-20 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణ ప్రదర్శణపై టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ వరుస ట్వీట్లతో కఠినంగా విమర్శిస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. అతడిని జట్టులోంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్‌ ప్రసాద్‌ అతడిని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు.

కేఎల్‌ రాహుల్‌కు విదేశాల్లో అత్యుత్తమ రికార్డు ఉందన్న దృక్పథాన్ని వెంకటేశ్ ప్రసాద్‌ తిప్పికొట్టాడు. అతడి గణాంకాలను విశ్లేషించాడు. 'కేఎల్‌ రాహుల్‌కు విదేశీ గడ్డపై అత్యుత్తమ టెస్టు రికార్డు ఉందని చాలామంది భావన. కానీ విదేశీ గణాంకాలు చూసిన అంత మెరుగ్గా ఏమీ లేవని.. అతడు విదేశాల్లో 56 ఇన్నింగ్సు లు ఆడాడు. సగటు 30.. మొత్తం 6 సెంచరీలు కొట్టాడు. ఆపై మిగిలినవన్నీ తక్కువ స్కోర్లే. అందుకే తక్కువ సగటు నమోదైంది. మిగతా వాళ్లవీ గమనించండి' అని వెంకీ ట్వీట్‌ చేశాడు. అతడితో పోలిస్తే శిఖర్ ధావన్, అజింక్య రహానె, శభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ బెట్టర్‌గా ఉన్నాయని పేర్కొన్నాడు.

ఇలాంటి సమయంలో టెస్టు జట్టులో తన స్థానం తిరిగి పొందాలంటే అతను కౌంటీ క్రికెట్ ఆడటం మంచిది. అక్కడ రాణించి తిరిగి తన స్థానాన్ని పొందాలి. పుజారా కూడా అదే చేశాడు కదా.. మళ్లీ ఫామ్ అందుకుని దేశం తరఫున టెస్టులు ఆడటం అన్నిటికీ సరైన సమాధానం. కానీ అందుకోసం ఐపీఎల్ ఆడకుండా ఉండటం కుదురుతుందా..?' అని వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నించాడు.

Tags:    

Similar News