ఛాంపియన్స్ ట్రోఫీ వరకే చాన్స్.. పాక్ కోచ్‌‌కు మాజీ క్రికెటర్ బాసిత్‌ అలీ వార్నింగ్

చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత పాకిస్తాన్ హెడ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టన్‌ను తొలగించే చాన్స్ ఉందంటూ పాక్‌ మాజీ క్రికెటర్ బాసిత్‌ అలీ హెచ్చరించారు.

Update: 2024-09-25 19:19 GMT

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత పాకిస్తాన్ హెడ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టన్‌ను తొలగించే చాన్స్ ఉందంటూ పాక్‌ మాజీ క్రికెటర్ బాసిత్‌ అలీ హెచ్చరించారు.ఇటీవల పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అంతర్జాతీయ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌ క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. బాబర్‌ ఆజం నేతృత్వంలోని జట్టు వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరితే అదే పెద్ద అచీవ్‌మెంట్‌ కానుంది. అలా కాకపోతే కిర్‌స్టన్‌ తన హెడ్ కోచ్‌ పదవిని వీడాల్సి వస్తుందని బాసిత్‌ పేర్కొన్నారు. బాసిత్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా హెడ్‌ కోచ్‌కు అభినందనలు చెబుతూనే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ వరకే ఆయన కొనసాగే చాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత తొలగిస్తారని ముందే హింట్ ఇచ్చారు.

కాగా, పాక్‌‌క్రికెట్‌ బోర్డు నిర్వహించిన ఉన్నత స్థాయి శిబిరంలో గ్యారీ కిర్‌స్టన్‌ మాట్లాడుతూ.. వన్డేల్లో పాకిస్తాన్ క్రికెట్‌ని మెరుగుస్తామని.. మళ్లీ గర్వపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఆ టైంలో బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్ సహా 9 మంది సీనియర్ పాక్ క్రికెటర్లు పాల్గొన్నారు. అసిస్టెంట్‌ కోచ్‌ అజర్‌ మహమూద్‌, హై పెర్ఫార్మెన్‌ డేవిడ్‌ రీడ్‌ సైతం ఉన్నారు. పాక్‌ జట్టును అన్ని ఫార్మాట్లలో సాధ్యమైనంత వరకు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News